స్నేహం విలువ : - డి.రాజశ్రీ-10వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-లింగాల ఘనపురం-జనగామ జిల్లా
 నవాబుపేట గ్రామంలో సురేష్,కుమార్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిది ఒకే ఊరు కావడంతో కలిసి మెలిసి ఉండడమే కాకుండా ఒకే కళాశాలలో చదువుకునేవారు.కుమార్ వాళ్లది చాలా పేద కుటుంబం.వాళ్ళ అమ్మానాన్నలు చాలా కష్టపడి అతన్ని చదివిస్తున్నారు. వ్యవసాయం పనులు, కూలికి వెళుతూ డబ్బులు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకునేవారు.కానీ సురేష్ వాళ్లది ధనవంతుల కుటుంబం.వాళ్లకు బాగా ధనం ఉన్నదని పొగరుతో సురేష్ ఎప్పుడు కుమారుని చులకన చేసేవాడు. ఎక్కిరించేవాడు.తన పక్కన కూర్చొని ఇచ్చేవాడు కాదు. కుమార్ ఎంతో క్రమశిక్షణ, వినయం కలిగిన వాడు. కళాశాలలో బాగా చదివేవాడు. కుమారుని అధ్యాపకులు కుమార్ ను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు చెప్పేవారు అది సురేష్ కు అసలే నచ్చేది కాదు. కాలేజీలో జరిగే ఏ పోటీలోనైనా కుమార్ ముందు వరుసలో ఉండేవాడు.సురేష్ మాత్రం వాళ్ళ నాన్నకు చాలా డబ్బు ఉందని చదువుకోకపోయినా, వ్యాపారం చేసి సుఖంగా బతుకుతానని చదును అశ్రద్ధ చేసేవాడు.తర్వాత కొంతకాలానికి కుమార్ చదువు పూర్తి చేసుకుని మంచి సంస్థలో ఉద్యోగం సంపాదించుకున్నాడు.సురేష్ వాళ్ళ నాన్నకు వ్యాపారంలో నష్టాలు వచ్చి ఆస్తినంతా కోల్పోతారు. ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడతారు.తన స్నేహితుడైన సురేష్ గుర్తుకు వచ్చి అతని దగ్గరికి వెళతాడు.సురేష్ ని చాలా సాదాసీదాగా చూసిన కుమార్ చాలా ఆశ్చర్యపోతాడు. చదువుకునే రోజులలో ఉన్నట్టు లేడు. చాలా బక్క చిక్కిపోయాడు.పాత బట్టలు ధరించాడు. చెప్పులు ధరించి వచ్చాడు. కుమార్ ని చూడగానే సురేష్ తలదించుకున్నాడు. కానీ కుమార్ సురేష్ ను సాదరంగా ఆహ్వానించి ఎలాంటి ద్వేషం, కోపం లేకుండా ఇది మన కార్యాలయం అని చెప్పాడు. అతని యోగక్షేమాలు విచారించాడు. అమ్మానాన్నల గురించి తెలుసుకున్నాడు.సురేష్ చాలా పశ్చాత్తాపడ్డాడు.ఏ కోపం లేకుండా మాట్లాడుతున్న సురేష్ ని చూసి అవమానంగా భావించాడు.సురేష్ కు తన తప్పు తనకు అర్థమైందని, తనను క్షమించమని అడిగాడు. ఏదైనా ఉద్యోగం చూపిస్తే బాగుంటుందని సహాయం కోరాడు.స్నేహంలో క్షమాపణలు ఉండవు.నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు.ధనం అశాశ్వతమైనది.స్నేహం శాశ్వతమైనది. అశాశ్వతమైన ధనాన్ని చూసుకొని అహంకారంతో ప్రవర్తించకూడదు.స్నేహ సౌరభాలను వెదజల్లుతూ, ఆనందంగా కలిసిమెలిసి జీవించాలి.అప్పుడే ఈ ప్రపంచం సుందరవనంలా తయారవుతుంది అని చెప్పాడు. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలతో కలిసిమెలిసి స్నేహితులుగా జీవించారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ స్నేహం యొక్క గొప్పతనాన్ని ఈ సమాజానికి తెలియజేశారు.
s

కామెంట్‌లు