అప్పుడప్పుడు ,
నన్ను నేనే ,
గిచ్చి చూసుకుని ,
నేను ,నేనేనా అని
పరీక్షించుకుని ,
నాకు ..నేనే ..
అబ్బురపడి పోతుంటాను !
ఆశ్చర్యంలో ...
మునిగిపోతుంటాను !!
బాల్యంలో ..
బ్రేకులు పడ్డ చదువు ,
కృశించిన ఆరొగ్యం ,
నాకు ...
భవిష్యత్తు ఉండదన్న ,
అయోమయంలో ,
డీలా పడిపోయినప్పుడు ,
నాకు ..
ఇంకోజీవితం
ఉంటుందన్న నమ్మకం ,
కొడిగట్టిన
దీపమయింది !
అయితే ...
దైవ నిర్ణయం
నాకే అనుకూలించి,
అన్న ..వదినలు
అందించిన ...
పునర్జన్మ ...
చిన్నన్న (మధు )
నూరిపోసి న ,
ఆత్మ స్థైర్యం ,
గంపెడాశ నింపిన
గుండె ధైర్యం ,
హైస్కూల్ మధ్యలొ
ఆగిన చదువు ,
పురివిప్పిన నెమలిలా
విజృంభించి,
సరాసరి ...
వైద్య రంగానికే
అంకితం చేసింది !
ఒక ఉన్నతాధికారిగా
సమాజంలొ
నిలబెట్టింది !!
కవిగా ...
కథారచయితగా ..
వ్యాసకర్తగా ...
తీర్చి దిద్దింది !
సమాజంలో ...
చక్కని పౌరుడిగా ...
వ్యధలను
అదిగమించి న ,
మాదిరి వ్యక్తిగా ...
నాకు ..
గౌరవ ప్రదమైన
కీర్తి కిరీటాన్ని
అందించి పెట్టింది !
అందుకే ..
ఆలోచిస్తే ...
ఇప్పటికీ
నా ..జీవితం ,
కలా ..నిజమా ...
అన్న సంశయంలోనే
మునిగి తేలుతుంటుంది !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి