మౌనమే ...: ----డా.కె .ఎల్వీ .-హన్మకొండ .

 ఆయనలాగే 
పార్టీవాళ్ళదీ 
మౌనభాషే !
అందుకే ఈ కబ్జా !!
------------------------
పూర్వ ప్రధానుల 
మకాం -ఢిల్లీ ..!
మనమౌన ప్రధాని 
మాత్రంహైద్రాబాదే !!
----------------------------
పదవిలో ఉండగా 
పొగడ్తల జల్లు !
ప్రాణంపోగానే 
పార్టీ సాక్షిగా సెగ !!
------------------------------
మౌనంతోనే -
ఘనతపొందిన ,
ప్రధాని ....!
చేతల్లో ఆయన ఘనాపాటి !!
---------------------------------------
        -