నీ ఉనికి: --సత్యవాణి కుంటముక్కుల==8639660566-కాకినాడ-5.
 పదవీ విరమణ చేశాననుచు
పనిలేకుండా కూర్చోకు
ముసలిని నేనని
మూల్గుచు నుండకు
ముప్పుగ మారును అదినీకు
పడక కుర్చీకి అంటుకుపోకు
పరిపరి విధముల వగచుచును
తాతలనాటి 
నేతులు తలచి
నీతులుగా
నవి చెప్పకుము
ఇంటను బయను
అంతో ఇంతో
అసరాగా నీవుండాలి
భార్యాబిడ్డల
బంధుజనులకు
భారంనీవు కాబోకు
పెద్దని నేనని 
హద్దులు పెట్టుచు
సుద్దులు నీవు చెప్పకుము
అడగకముందే సలహా చెప్పి
అవమానాలను పడబోకు
తప్పులు ఎంచీ తిప్పలు
పడకుము
తెప్పుననీవు ఎగురకుము
వానప్రస్థం వనమునె గాదు
వలచినచో అది నీఇంటే
పొందుగౌరవం అందరియందు
మెండుగ ప్రేమను అందగను 
గాంధీ కోతుల బోధన వినుము
ఘనుడందురు నిను
అదరును
వేదములంటీ
మాటలు విసుమ
వివేకముతొ నువు పాటించు
       
కామెంట్‌లు