ఏమన్నది ఏమన్నది నామువ్వన్నెలజెండా :-పోలయ్య కవి కూకట్లపల్లి--హైదరాబాద్.....9110784502-


 అదిగో అదిగో అల్లదిగో 

ఆ నీలి ఆశల ఆకాశంలో

రెపరెపలాడుతువుంది 

నా మువ్వన్నెలజెండా

ఏడురంగుల ఇంద్రధనస్సులా...

కోటిప్రభల సూర్యబింబంలా...

ముత్యాల, మురిపాల, ముచ్చటైన

నామువ్వన్నెలజెండా ఏమన్నది ఏమన్నది ?

నీతిగా... నిజాయితీగా... నిర్భయంగా 

తలఎత్తుకు తిరగమన్నది


ఏమన్నది ఏమన్నది ?నా మువ్వన్నెల జెండా

సర్వమతాలకు, కులాలకు, జాతులకు

సంస్కృతికి,సకల సంప్రదాయాలకు

నా భారతజాతి... నిలయమన్నది 

భిన్నత్వంలో ఏకత్వమే... మన నినాదమన్నది


ఏమన్నది ఏమన్నది ?నా మువ్వన్నెల జెండా

ఎందరో నిస్వార్థపరుల, మహానుభావుల 

మహాత్ముల, స్వాతంత్ర్య సమరయోధుల,

జాతినేతల, జైలు జీవితాల, రక్తతర్పణాలకు

ప్రతిఫలమే... మన అర్థరాత్రి స్వాతంత్ర్యమన్నది


ఏమన్నది ఏమన్నది ?నా మువ్వన్నెల జెండా

ప్రజాస్వామ్యమే... మనకు ఆరవప్రాణమన్నది

అదే మన భరతమాతకు... స్వర్ణాభరణమన్నది

రాజ్యాంగమే... మనకు రక్షణ కవచమన్నది

అదిగో అల్లదిగో ఆ నీలి ఆశల ఆకాశంలో

రెపరెపలాడుతువుంది నా మువ్వన్నెలజెండా


కామెంట్‌లు