సాక్షి శతకము: - బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబరు:9290061336

 వ్రాయుటకు తెలివి నీవే/
వ్రాయునదెల్లను సుబోధ వాక్యము నీవే/
మాయాతీతుడ వీవే/
వేయి నామములు గలట్టి వేల్పువు సాక్షీ//(51)
    కేశవ నిన్నెల్లప్పుడు
     ఆశతొ ప్రార్ధించునట్లు అభయంబీవే
     నాశరహిత సర్వేశ్వర
      ఈశానను బ్రోవుమయ్య యిలలో సాక్షీ//(52)
             -