పచ్చచీర కట్టుకున్న (దేశ భక్తి గీతం ): -సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి.- మొబైల్: 9908554535.


 పచ్చ చీర కట్టుకున్న భరతమాత

మచ్చలేని చరితగల మహిమాన్విత!

                                  !! పచ్చచీర !!

బంగాళాఖాతమ్మే  బహు కానుక లీయగా

అరేబియా హిందూలే హారతులై వరలగా

కావేరి గోదారి   కృష్ణాది నదులన్ని

గలగలమను సవ్వడితో  నృత్యంబు సేయగా.

                                           !! పచ్చచీర !!


కాశ్మీరమే కదా కలకంఠి గాత్రము

శాంతమే ఆ తల్లి తల్లి ప్రస్పురిత నేత్రము

ద్రావిడ సొగసులచే ధగధగ మెరయుచూ

కన్యాకుమారి కాలి మంజీరములూపుచూ

                                             !! పచ్చ చీర  !!


అండమాను లక్షదీవులామె  కరములు

హిమాలయములే ఆమె ఎత్తయిన శిరములు

విజ్ఞాన మను గుండె విశదముగా కొట్టుకొనుచు

ప్రగతి బాటల వైపు పరుగిడ బోవుచు .

                                             !! పచ్చ చీర !!


కామెంట్‌లు