19. ఆ.వె. కనులజూచినదియు కావలెననబోకుదొరకదింక మనకు దూరమైన
నెగిరె పళ్లెములకు నెటువైపు బోదుము
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
20. ఆ.వె. మంచి మిత్రుడుండ మనకేమి లోటగు
వేరు చేయువారి దూర ముంచు
పాలు తేనె కలియ పదుగురు మెచ్చరే
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
21. ఆ.వె. ఎలుక తొంగి చూచు నే గింజ కైనను
కుక్కతోక నూపు కూడు జూచి
తుట్టతుదివరకును పొట్ట తిప్పలు జూడు
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
నీతి పద్యాలు:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి- మొబైల్: 9908554535.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి