భరత పుత్రుడా! (గేయ సూక్తులు):-డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల9948089819


 మనిషి లోపల మానవత్వము

మంచు కొండగ నిలిచి పోవలె

మానవత్వము చచ్చి పోయిన

మనుట వ్యర్థము భరత పుత్రుడ! 15


పరుల కోసమే నాదు బ్రతుకని

భక్తితో ఎలుగెత్తి చాటర

పరుల సేవయే భాగ్యధనమని

భక్తి నుడువర భరత పుత్రుడ!   16


మంచి మాటలు పలికి నప్పుడె

మంచి కురియును ఈ జగమ్మున

మంచి చచ్చిన మృగ్య మౌనుర

మమత దివ్వెలు భరత పుత్రుడ!  17