భరత పుత్రుడా! (గేయ సూక్తులు): -- డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల9948089819


 స్వేచ్ఛ కోసము పరితపించెడు

వీర యోధుల దివ్య బాటల

సాగి నప్పుడె ప్రగతి కలదుర

సమత కోరెడు భరత పుత్రుడ! 43


నీతి దప్పిన వాని బ్రతుకిక

వ్యధా భరితము నిజము నమ్ముర

కోతి చేష్టలు మాని ముందుగ

కూర్మి పలుకర భరత పుత్రుడ!  44


కామెంట్‌లు