'' ఆ '' ఇద్దరు : - టి. వేదాంత సూరి
 ఆరియా పుట్టిన రోజు రేపే ఉందని ఆద్య మురిసి పోతుంది. రేపు స్కూల్ కు కూడా వెళ్లనని చెప్పేసింది. అమ్మ కూడా సరే అంది. ఆరియా పుట్టిన రోజే కాకుండా ఇంట్లో గోదా కళ్యాణం కూడా ఉంటుంది. దాంతో అందరు రేపు సెలవులు పెట్టేసారు. 
ఆరియాకు పుట్టిన రోజు కేక్ చేయడానికి అమ్మ హడావిడిగా వుంది. 
ఇక్కడ ఉదయం ఏడు గంటలకే కార్యాలయాలు, ఎనిమిది గంటలకు స్కూల్ ఉంటుంది. అందుకే  పొద్దున స్నానాలు , వంటలు కష్టమని అందరూ రాత్రి వంటల పని పెట్టుకుంటారు. ఇండియా లో ఉదయం ఎలా హడావిడిగా ఉంటుందో ఇక్కడ సాయంకాలం అలాగే ఉంటుంది. తీరిగ్గా కూర్చుని మాట్లాడు కోవడం కూడా సాయంకాలాలే. 
ఆరియా ఫోన్ కనిపించగానే చెవిలో పెట్టుకుని మాట్లాడుతున్నట్టు నటిస్తుంది. ఆ సమయం లో రక రకాల హావభావాలు.ప్రదర్శిస్తుంది 
 నిన్న సాయంకాలం అలాగే మాట్లాడుతుంది. ఎవరికి ఫోన్ చేసావు ఆరియా అని అడిగితె చీమ కు అని ఠక్కున చెప్పింది. మరి ఏమంది చీమ అంటే హలొ అంటుంది అని చెప్పేసింది. అందరం బాగా నవ్వుకున్నాం, పిల్లల ఊహలు ఎలా వుంటాయో మనకు ఈ సంఘటన చెబుతుంది కదూ . 
ఆద్య తప్పని పరిస్థితిలో డే కేర్ వెళ్ళింది. రేపు ఏ డ్రెస్ వేసుకోవాలి, చెల్లి బర్త్ డే ఎలా చేయాలి అనే ఆలోచిస్తుంది. ఇంట్లో ఎవరి పుట్టిన రోజైన ఆద్యకు ఎంతో ఇష్టం, ఏదో ప్రత్యకంగా చేస్తుంది. 
(మరిన్ని ముచ్చట్లు రేపు )