ఆయుధం:- జగదీశ్ యామిజాల
 వివేకులకు 
జ్ఞానం ఆయుధం
జైత్రయాత్రలో 
కృషి ఆయుధం
యాత్రా భూమిలో 
కాలం ఆయుధం
బాధను దాచడానికి 
నవ్వు ఆయుధం
నిగ్రహానికి 
మౌనం ఆయుధం
అన్నీ నెరవేరడానికి 
ఆచరణ ఆయుధం
ఉన్నంతవరకే 
ఆయువు ఆయుధం
అంతలోపు 
బతకడం తెలిస్తే
జీవితమే ఆయుధం
శుభోదయం
కామెంట్‌లు