'' ఆ '' ఇద్దరు : - టి. వేదాంత సూరి


 ఆద్య మొదటి రోజు డే కేర్ వెళ్లి రాగానే చెల్లిని హాగ్ చేసుకుంది. ఆరియా కూడా ఎంతో ఆనందించి దగ్గరకు వెళ్ళింది. ఈ ప్రేమలో వాళ్ళు ఎటు వెళతారో ?ఎటు పడతారో? అర్థం కాదు. మనం దూరం నుంచి గమనించ వలసిందే. 
ఆరియా తనకు వచ్చిన మాటలతో రక రకాల విన్యాసాలు చేస్తుంది. 
సాయం కాలం కాస్తా చల్ల పడింది . ఎప్పటిలా కాకుండా కొద్దీ దూరం లో వున్నా ఎక్సర్ సైజు పార్క్ కు వెళదామంది. ఆ పార్క్ కు వేరే పేరు వుంది కానీ ఆద్య మాత్రం ఆ పేరు పెట్టుకుంది. ఎందుకంటె అక్కడ పిల్లలతో పాటు పెద్దలు కూడా వచ్చి వ్యాయామం చేస్తుంటారు. అంతా సందడిగా ఉంటుంది.ఇంటి నుంచి పది నిమిషాల డ్రైవ్ తో వస్తుంది. అక్కడికి ఏడు గంటలకు  వెళ్ళాం,  అనుకోకుండా అక్కడికి కర్నూల్ కు చెందిన ముస్లిం కుటుంబం కూడా వచ్చింది. మేము తెలుగులో మాట్లాడుతుంటే ఎంతో ఆనందించి పలుకరించారు. కరోనా వల్లనే తమకు కూడా ఇక్కడ వుండే అవకాశం వచ్చింది అని చెప్పారు. ఒక గంట పాటు ఆద్య, ఆరియా  ఇద్దరూ ఆడి ఆడి అలసి పోయారు. ఆరియా ఇంటికి రాగానే డిన్నర్ చేసి త్వరగా పడుకుంది. ఆద్య మాత్రం కాస్తా ఆలస్యంగా అమ్మ వద్ద కథలు వింటూ పడుకుంది. ఈ పనులతో పాటు పండుగ, , ఆరియా పుట్టినరోజు ఏర్పాట్లపై చర్చలు జరుగుతూనే వున్నాయి. 
(మరిన్ని ముచ్చట్లు రేపు )