సమ సమాజం రావిపల్లి వాసు దేవరావు పార్వతీపురం
 వద్దు వద్దు అసలు వద్దు 
భేద భావ మసలు వద్దు 
మనలో కలతలు రేపిన 
కుల మతాలు అసలు వద్దు 
వద్దు వద్దు అసలు వద్దు 
అసమానతలసలు వద్దు 
మనలో తేడాలు చూపే 
ధనిక బీద భేద మొద్దు 
వద్దు వద్దు అసలు వద్దు 
ఈర్ష్య అసూయ లసలు వద్దు 
కలసి మెలసి  మస లేటి 
కూరిమియే మనకు ముద్దు 
వద్దు వద్దు అసలు వద్దు 
అహంకార మసలు వద్దు 
ఎంత ఎదిగిన ఒదిగే  
గుణమే కద మనకు ముద్దు  
వద్దు వద్దు అసలు వద్దు  
ఆధిక్యత అసలు వద్దు 
సమతా మమతలు  కూడిన 
సమాజమే మనకు ముద్దు
 
కామెంట్‌లు