వివర్ణం :--కె ఎస్ అనంతాచార్య


 సలోనియం లైకోపేరేసియం

ఈ పేరు కొత్తగా

అనిపించవచ్చు    

 ప్రపంచం దానికి  శాస్త్రీయ

 హంగులు పొదిగి ఉండవచ్చు  బహువిధాలుగా రూపొందిoచినా

 దాని మీద చర్చ 

రచ్చబండ మీద    దృశ్యం ఇప్పుడు

అదృశ్యమైన విలువ కోసం

రైతన్న ఆరాటం!


ఏ నోట విన్నా 

అందరి ఇంటి కూర మాట

టమాట చోటు కరువై 

 కంటి నీరు చేరువై !


నారు పోసిన నాడే చేతి  మీద

చిగురించిన   పచ్చబొట్టు ఆశ 

చేతి  మీద కాయని

 రూపాయల లెక్క   

 నీరు కట్టినప్పుడల్లా ఒంటి కి కరెంటు పాకినట్లు

 బిల్లురాగానే తోట తలకిందులైనా పచ్చ పూల  మీద  విచ్చుకున్న

కొత్త చివుర్లు 


పిందెలు గుండెలో

 లక్ష్మీదేవి అందెల రవళులు వినిపించినట్లు

 బ్యాంకు రుణo గాలిలో తెలిపోయినట్లు

లాభాల వీచికలు 

కూతురు పెళ్లికి వింజా మరలు వీచినట్లు గట్ల మీద పగటి కల


పెద్ద ముత్తైదువ

నుదుటిపై సింధూరం లా ఉషోదయ

వర్ణాన్ని నింపుకున్న టమాటను చూడగానే ఒంటి నిండా కొత్త రక్త ప్రవాహం !  హుషారెత్తిన కర్షక  హృదయం


కూరకు తోడు నిల్వకుంటే

నాలుకకు స్వర్గం లేదు

నలుగురు కంచాలకు పంచెందుకేమీ లేదు 

కష్ట జీవి జేబుకు మాత్రం

పట్టుకున్న నల్లి పురుగు


సాస్ అయి రెస్టారెంటుల

పాస్ చేసినా  

విటమిన్ గా దేహమ్ లోని గాయల మాన్పించినా

కల్టీవేట్ చేసినా అసామి

గుండెకు గాయమే చేసింది



మీటింగ్ లో ఎదురు దాడి ఆయుధమైనట్లు దళారి చేతిలో ఓడి  వాడిపోయిన మొక్క పాలితుల కలుపు మొక్క


కళ్ల కెక్కిన టమాట ఎరుపు

మందు కొట్టిన చెట్టులా

మగత లొనే ఊగి పోయింది 

 ధరను కోల్పోయి రోడ్ మీద కుళ్లు కంపై మాట మూగపోతుంది



కామెంట్‌లు