మూడు వన్నెలుండు మురిపాల జెండానుఅదిగొ యెర్రకోట నధివశించ
భరతమాత హృదయ భాగ్యమిదియు చూడ
జాతి యంత కలిసి జయము పలికె!
సామ్య వాద విలువ సం రక్షణము సేయ
దేశ ప్రజలు గూడి దేశభక్తి
చేతులెత్తి పలుకు జేజేలు వరుసను
భారతీయ కీర్తి భావమిదియె!
గణ తంత్ర దినోత్సవం -ఆట వెలదులు : ---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి