చదువోయి నీవు చదువోయిచదువుకుని చక్కగా మనవోయి!!చదు!!
చదువంటె భాషలు
చదువంటె గణితము
చదువంటె విజ్ఞానశాస్త్రమూ
అన్ని విషయాలా మేళవింపోయీ
అన్ని విషయాలా ఆకళింపోయీ!!చదు!!
చదువంటె నీతి
చదువంటె నియమం
చదువంటె ప్రేమానురాగాలు
చదువంటె ధైర్యం
చదువంటె స్థైర్యం
చదువంటె పరమత సహనమ్మూ
చదువంటె మానవత పరిమళమ్మోయీ !!చదు!!
చదువుంటె డాక్టరూ
చదువుంటె మాష్టరూ
చదువుంటె పోలీసు ఉద్యోగి
చదువుంటె జిల్లా కలెక్టరే కావచ్చు
చదువుకో నాయనా చదువుకో తండ్రీ!!చదు!!
చదువు:--:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి