నేతాజీ : సృజన్ సింధూర్
 సాయుధ పోరాటమే తన సిద్ధాంతం అని నమ్మి
ఆచరణలో పెట్టిన భారత  సర్వ సైన్యాధి నేత
స్వాతంత్ర్య సాధన ఏ తన పోరాటం అని తెలిపి
ఆశయం వైపు సాగిన జాతీయ కాంగ్రెస్ అధినేత
అహింసా వాదాన్ని వ్యతిరేకించి గాంధీ తో విభేదించి
ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పరచి సైన్యాన్ని సమీకరించి
రష్యా జర్మనీ జపాన్ ల సహాయాన్ని కూడగట్టికొని
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించి పోరు సలిపె
తండ్రి నుండి జాతీయత వాదం అందిపుచ్చుకొని
కలకత్తాలోనే కాలేజీల్లో విద్య కొనసాగించి
ఇండియన్ సివిల్ సర్వీసుకు సెలెక్ట్ అయిన ప్రతిభ
కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర
భరతమాత బంధనాలను తెంచే వ్యూహాలను పన్ని
గారిబాల్డి వంటే ఇటాలియన్ ల ప్రభావం పొంది
సర్వ శక్తులను వడ్డీ భరతమాత రుణము తీర్చి
జై హింద్ అనే నినాదంతో జనానికి దగ్గరైన నేత
కామెంట్‌లు