ఆడుదాం::- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 బాలలార ఆడుదాం

బాలికలార ఆడుదాం

ఎగురుదాం దూకుదాం

ఆటలన్ని ఆడుదాం

కలిసిమెలిసి తిరుగుదాం !!బాల!!

ఏ ఆటలు ఆడుదాం?

బొంగరాలు ఆడుదాం

గిల్లీదండా ఆడుదాం

దొంగాపోలీస్ ఆడుదాం

చార్ పత్థర్ ఆడుదాం !!బాల!!

ఏ ఆటలు ఆడుదాం?

పులి మేక ఆడుదాం

కైలాసం ఆడుదాం

జారుడుబండ ఆడుదాం

ఒప్పులకుప్ప ఆడుదాం !!బాల!!

ఏ ఆటలు ఆడుదాం?

సూదిలొదారం ఆడుదాం

చెంచా గోటీ ఆడుదాం

బంతులాట ఆడుదాం

ఉయ్యాలాట ఆడుదాం !!బాల!!

ఏ ఆటలు ఆడుదాం?

గోళీలాట ఆడుదాం

కుర్చీలాట ఆడుదాం

బొమ్మలాట ఆడుదాం

సీకులాట ఆడుదాం !!బాల!!

ఏ ఆటలు ఆడుదాం?

పచ్చీసాట ఆడుదాం

కబడ్డీఆట ఆడుదాం

ఖోఖో ఆట ఆడుదాం

తాడుదుంకు డాడుదాం !!బాల!!

ఏ ఆటలు ఆడుదాం?

ముక్కుగిల్లు డాడుదాం

దాగుడుమూత లాడుదాం

వోమనగుంత లాడుదాం

కోతికొమ్మచ్చి ఆడుదాం !!బాల!!


కామెంట్‌లు