సంతోషాల హరివిల్లు...: --మొహమ్మద్ .అఫ్సర వలీషా--ద్వారపూడి (తూ గో జి).


 సందర్భం ఏదైనా 

సంతోషాల హరివిల్లు 

సొగసులద్దుకున్నప్పుడే కదా...


బంధాలకు ఆత్మీయ 

బంధనం ఏర్పడేది

అందరూ మమేకమై మనసులు

కలుపుకున్నఫ్పుడే కదా....


ఆదమరిచి మాట్లాడేది

అలవికాని అనుభూతిని

అందరితో పంచుకునే

టప్పుడే కదా.....


అలసి సొలసిన

మస్తిష్కానికి

ఆనందాలు చేరేది

ఒకరితో నొకరు

అందరై కలిస్తేనే కదా....!!