తీవ్రమైన తలనొప్పి వచ్చినప్పుడు దీని ఆకుల ను ముద్దగా నూరి అందులో సొంటి పొడి కలిపి తలకు పట్టుగా వేయాలి. మంచి నిద్ర పట్టి తలనొప్పి తగ్గిపోతుంది.మూత్ర పిండాలలో రాళ్ల వల్ల మూత్రం లో మంట వస్తే బచ్చలి కూర ముద్ద లో ఉసిరి వరుగులు తాటి బెల్లం నీళ్లు కలిపి కషాయం చేసి చల్లార్చి త్రాగితే మంట తగ్గి పోయి రాళ్లు కరిగిపోతాయి. ఇది మూత్రపిండాలను సరిచేస్తుంది.బచ్చలి కూర ముద్ద లో ధనియాల పొడి యాలకుల పొడి సోంపు పొడి వేసి నీళ్లు కలిపి కాషాయం చేసి త్రాగితే అధిక రక్తపోటు తగ్గి పోతుంది. ఇదే కషాయం కడుపునొప్పి రానివ్వదు. కడుపులోని గ్యాసును తొలగిస్తుంది. దీన్ని ఆహారంలో ఎక్కువగా వాడితే మోకాళ్ళ నొప్పులను, కీళ్ళ నొప్పులను రానివ్వదు. బచ్చలికూర ముద్దను, దురద లపై పూస్తే దురదలు తగ్గిపోతాయి.
బచ్చలి కూర - ఔషధంగా...: పి . కమలాకర్ రావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి