పోయి నేడు సంక్రాంతికి అమ్మ నాతోనే ఉన్నది ఉదయాన్నే ముగ్గులు వేయలనుకున్నా లేటే అయింది మరి పని మనిషి నీళ్లు చల్లి రెడీ పెట్టాలి గదా!వాకిట్లో ఇంతకు ముందు నేల ఉండేది ఈ సంవత్సరానికి పూట్ పాత్ కట్టేశారు ఆ పుట్ పాత్ పై టైల్స్ వేసి నడవడానికి అందంగా ఉంది గాని ముగ్గులు వేయడానికి అంత అనువుగా లేదు అంటే ఎత్తు పల్లాలు లేకుండా సమంగా అయితే ఉంది ఇకపోతే నేల మీద వేసిన ముగ్గులో రంగులు బాగా కనిపిస్తాయి దీని మీద రంగుల టైల్స్ ఉండటం వలన రంగులు బాగా కనిపించవు ప్రతి సంక్రాంతికి వేసినట్లే పొంగలి కుండలు,చెరకు గడలు,అవులు వచ్చేలా ముగ్గులు వేశాం వాకిలి పెద్దగా ఉన్నందువల్ల మూడు ముగ్గులు పట్టాయి చక్కని రంగులు దిద్దాం ముందురోజే ఆవుపేడ తెప్పించి పెట్టుకున్నాం ఆవుపేడ తెచ్చి గొబ్బెమ్మలు చేసి మధ్యలో ఉన్న ముగ్గు పైన పెట్టాను మా స్టాఫ్ గరిక ,రేగుపండ్లు ఇంకేదో ఆకులు అన్ని కొనుకొచ్చారు మొదటగా గొబ్బెమ్మ కు పూలు పెట్టీ వాటి మీద ఈ గరిక ,రేగుపండ్లు పెట్టాను ఇదంతా అయ్యేసరికి పది గంటలు అయ్యింది అప్పటికే పేషంట్లు వచ్చేస్తున్నారు పాపం ముగ్గు తోక్కకుండానే లోపలికి వెళుతున్నారు ముగ్గులన్నిటికి పసుపు కుంకుమ చల్లాను దీంతో ఇక్కడి పని పూర్తయినట్లే మామూలుగా అయితే మరి ఇప్పుడు సెలిఫోన్ల కాలం కదా ! ఫోటోలు తీయలి కదా ఆ తర్వాత ఒక అరగంట ఫోటోలు సెషన్ నడిచింది ఇక ఇప్పుడు పైన మొదలెట్టాలిఈ ముగ్గుల తతంగమంతా మా ఆసుపత్రి ముందు జరిగింది మేముండేది మూడో ఫ్లోర్ లో మరి అసలు ముగ్గులు ఎక్కడ వేసుకోవాలి కదా అందుకే నేను ముగ్గులు రంగులు పట్టుకొని పైకి వెళ్ళాను అప్పటికి పనమ్మాయి ఆ గచ్చంతా కడిగి శుబ్రంగా ఉంచింది ముగ్గు మొదలు పెడదాం అంటే ఇంకా తడి ఆరలేదు అందుకని అంతలో పాలపికలతో ముగ్గు వేయడం ఆరభించాను అమ్మ అక్కడే కుర్చీ వేసుకొని కూర్చున్నది రంగు రంగుల పాల పికల్ని తెచ్చి అందంగా మగ్గులా అమర్చాను వాటిని నా చేతికి అందించడంలో మా స్టాఫ్ సహాయం చేస్తున్నారు చాలా అందమైన రంగుల రంగవల్లి తయారయింది అమ్మ ఆ ముగ్గు చూసి ఎంతో మురిసిపోయింది ధేంతో చేసినా మగ్గుకు భలే కళ తెప్పిస్తావు అంటూ సంబరపడింది ఇది పూర్తి అయ్యేసరికి మిగతా నేల ఎండింది ఇపుడు పద్మాలు నెమలి ముగ్గు మొదలు పెట్టాను నేను ముగ్గు వేస్తుంటే మా పనమ్మాయి రంగులు ఇసుకలో కలిపి ఇస్తున్నది ఆ పనయ్యాక ఒక పక్కనుంచి తనూ రంగులు వేయడం మొదలు పెట్టింది ఈ ముగ్గు పూర్తవ్వడానికి గంట పైనే పట్టింది ఈ లోపు పక్కన ఒక చిన్న ముగ్గు వేసింది అమ్మ ఆ ముగ్గు మీద పాలు పొంగిస్తాం పాలు పొంగకా ఆ కుండలోనే పొంగలి వండుతాం అందుకోసమే ముగ్గు సిద్దం చేసింది అమ్మనేను ముగ్గంతా పూర్తి చేశాక గొబ్బెమ్మలు చేయడం మొదలుపెట్టాను ఇది ఇల్లు కదా అని పెద్ద పెద్ద గొబ్బెమ్మలు చేసి పెట్టాను ఇక్కడా గొబ్బెమ్మలు తల్లో పూలు పెట్టీ ఇందాక వేసినా రేగుపండ్లు గరికపోసల్ని గుచ్చాను అదేంటో గాని సంక్రాంతి పండగకు కుండీలో ఎలా మొలుస్తు0దో ఏమో గుమ్మడి తీగ మొలుస్తుంది ఒక పువ్వు వేస్తుంది మధ్యలో గొబ్బెమ్మ కు ఆ గుమ్మడి పువ్వు పెట్టమన్నది అమ్మ అలాగే పెట్టాను ముగ్గులు గొబ్బెమ్మలు రెడీ అయినాయి కాబట్టి మళ్ళీ కాసేపు ఫోటోలా హడావిడి నడిచిందిఇక పొంగలి వండడం మిగిలింది ఇప్పటికి సూర్యుడు నడినెత్తికొచ్చేశాడు చలిలో ఎండ బాగానే ఉన్నా మధ్యాహ్నాం అయ్యే సరికి చురుక్కు మంటున్నది మేము చిన్న ఇనుప పొయ్యి ఒకటి తయారు చేయించుకున్నాము దానిని తెచ్చి అమ్మ వేసిన ముగ్గు మధ్యలో పెట్టి దానిలోకి చిన్న చిన్న కట్టె పుల్లలు పేర్చాము బండి లోని పెట్రోలు కొద్దిగా వేసి మంట వెలిగించాము కొత్తగా కొనుకొచ్చినా మట్టి కుండను తెచ్చి పొయ్యి మీద పెట్టి పాలు పోశాము పాలు వేడయ్యాక బియ్యము బెల్లం వేసి పరమాన్నం వండాము ఈ హడావిడి అంతా వీడియో తీసుకున్నాము అమ్మ దగ్గరే కూర్చుని చూస్తూ ఉన్నది అప్పటికి అనారోగ్యం ఏమి లేదు ఈ పండుగ అయిపోయినా నాలుగు రోజులకే గుండె నొప్పితో అమ్మ ఆసుపత్రి పాలయ్యింది నేను గొబ్బెమ్మలు పెడుతుంటే నూ పొంగలి వండుతుంటే నూ మా చిన్న అబ్బాయి అమ్మమ్మ దగ్గరే కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అమ్మమ్మతో కబుర్లు చెప్తూ ఉన్నాడు ఈ దృశ్యమంతా వీడియోలో రికర్దయ్యింది ఇప్పుడు అదే మాకు జ్ఞాపకార్థం అయ్యింది ఈ సంక్రాంతి పండుగ చేసుకోకూడదు కదా నిరుటి పండుగనే తలుచుకుంటున్నానుజనవరి 14 వ తేదీ పండుగ అయిపోయాక నాలుగు రోజులు గడిచాయో లేదో అమ్మ ఊపిరాడక బాధపడింది కార్డియాలజిస్ట్ వచ్చి చూశారు గుండెలో కొద్దిగా ప్రాబ్లము వచ్చేలా ఉందని అన్నారు ఐదు సంవత్సరాల క్రితం మూడు సార్లు స్టంట్లు వేశారు అప్పుడే తట్టుకోలేక పోయింది ఇప్పుడు మరల ఏమవుతుందో అని భయపడ్డాు అమ్మ మాత్రం నేను గుండె కు ఏమి ఆపరేషన్లు చేయించుకొను నేను హాస్పిటల్ కు కూడా రాను నాకు ఇంట్లోనే వైద్యం చేయండి మీరంతా డాక్టర్లు కదా ఎక్కడికి తీసుకెళ్లద్దు అని ఖచ్చితంగా చెప్పేసింది రెండు రోజులు ఆక్సిజన్ పెట్టి ఊపిరి సరిగ్గా ఉండేలా చేశాం కానీ 19 వ తేదీ రాత్రికి సమస్య ఎక్కువైంది అప్పుడూ నన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లాద్దు నేను వెళ్లిపోయే సమయం వచ్చింది అంటూనే స్పృహ తప్పింది వెంటిలేటర్ వేయవలసినా అవసరం గుర్తించి మావారు వెంటనే అంబులెన్స్ పిలిపించి కరీంనగర్ తీసుకెళ్ళాము హైద్రాబాద్ వెళ్లాలంటే అంత సమయం ప్రాణాపాయం లేకుండా ఉండాలి కదా మేము హాస్పిటల్ చేరే సరికి అక్కడ డాక్టర్లు ఎక్విప్ మెంట్ తో రెడీగా ఉన్నారు వెళ్లినా ఐదు నిమిషాల్లో వెంటిలేటర్ వేశారు అప్పుడు ఊపిరి పీల్చుకున్నాం శ్వాసకు ఇబ్బంది లేదని
నిరుటి సంక్రాంతి:--డా. కందేపి రాణి ప్రసాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి