సెల్లు మూగబోయిందియువకుల
అనంత మాటల ప్రవాహానికి
తట్టుకోలేక(1)
వాగ్దానాలు ముక్కుమీద
వేలేసుకుంటున్నాయి
రాజకీయనాయకుల
తెంపరితనాన్ని చూసి(2)
వైద్యులు లక్ష్మీప్రసన్నం
చేసుకుంటున్నారు
రోగుల రోగాలే
సాక్ష్యంగా చూపెట్టుకొని(3)
సంస్కృతి షాక్ అయింది
వలువల విలువల
విశృంఖలత్వాన్ని చూసి
నడతల నాగరికతను చూసి(4)
పద్యం వెక్కిరించింది
దుడ్డుకర్రలను చూసి
నడుములను ఎక్కడ
విరగగొడతాయోనని(5)
నాన్న నవ్వాడు
పిల్లల నెలల లెక్కలు చూసి
పెన్షను వచ్చిన రాత్రి
నిశ్చింతగా నిద్రపోయాడు(6)
కృష్ణమూర్తి లిరిక్కులు: --డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి