చల్ చల్ గుర్రం, చలాకి గుర్రంచక చక పరుగులు తీసే గుర్రం
మహాభారత యుద్ధంలో
నీకే పట్టాభిషేకం
అశ్వదళం అనే పేరుతో
రణ ప్రధమ స్థానం
ప్రభువుల వేటలో ఉరికే
ప్రాణ మిత్రుడు గుర్రం
పొరుగు రాజ్యాల పై పోరు లో
ప్రాణాలు వదిలే గుర్రం
కొరడా వీపుపై ఝుళిపి స్టే
రయ్యిన దౌడు తీసే గుర్రం
కొండ మీది కోట అయినా
సయ్యన దూసుకెళ్లే గుర్రం
కళ్ళం చేతిలో ఉన్న చాలు
దుర్గమ్ దారైనా దాటే గుర్రం
జీను సవరించిన చాలు
దన్నుగా తోడుండే గుర్రం
అరేబియన్ అయినా ఫ్రెంచైనా
అందాలొలికే గుర్రం
క్రీడా పోటీల్లో పాల్గొనే
కీలకమైన గుర్రం
వినోదంగా వ్యాపారంగా
రేసుల్లో పరిగెత్తే గుర్రం
వాణిజ్య బగ్గీ జట్కా గా
రవాణాకు పనికొచ్చే గుర్రం
గుట్టల అయినా ఎడారుల అయినా
గిత్తల సవ్వడితో గుర్రం
చెట్లు నా నా చేమలు నా
చెంగున దూకే గుర్రం
యువరాజుల స్వారీలో
వెన్ను చూపని గుర్రం
యువరాణుల పోటీలో
వెనకడుగు వేయని గుర్రం
రాజుల కిష్టమైన సైన్యం
ప్రియ జాతి గుర్రం
రాజ్యాల ప్రసిద్ధ గళం
ప్రగతిశీల గుర్రం.
చలాకీ గుర్రం: డాక్టర్ కందేపి రాణి ప్రసాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి