అల్లరి నేర్చిన తీగల్లారాకాలం మరిచీ హాయిగ తిరిగేపాపల్లారా రారండీ ఇటు రారండీ !! చిట్టీ!!ఆటా పాటా మాటా కలిసిన చదువుందిమన బడిలోన, మన గురువుల ఒడిలోనచదువుల గుడి, నడవడి చక్కగ నేర్పే ఒడి !! చిట్టీ!!ఎలుకా సింహం కాకీ పాముతాబేలు మరి కుందేలుఅడవిజంతువుల కథలున్నాయి !! చిట్టీ!!నీరూ నిప్పూగాలీ మట్టీరైలు బస్సూ ఓడ విమానంఅన్ని వస్తువుల కథలున్నాయి !! చిట్టీ!!చిన్ని క్రిష్ణుడూ చిట్టి రాముడూవెంకయ్యా మన చందమామదేవుళ్ళందరి కథలున్నాయి !! చిట్టీ!!ప్రహ్లాదుడు ధృవుడు మార్కండేయుడునచికేతుడు మరి శిరియాళుడుబాలభక్తుల కథలున్నాయి !! చిట్టీ!!శాంతీ సహనం సత్యాహింసలు నీతినిజాయితీలుదానం జ్ఞానం ధర్మం మోక్షం సర్వమానవ సౌభ్రాతృత్వంమంచిని తెలిపే కథలున్నాయి !! చిట్టీ!!:
పాపల్లారా:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి