సెంటోసాలో మ్యూజికల్ ఫౌంటెన్:--డా.. కందేపి రాణీప్రసాద్.


 పిల్లలూ! సెంటోసా అనేది సింగపూర్ లోని ఓ ఎంటర్ టెయిన్ మెంట్ పార్కు. సింగపూర్ కున్న పెద్ద దీవులలో సెంటోసా కూడా ఒకటి. మీరెక్కడైనా నీళ్ళు డాన్స్ చేయడం చూశారా? నీళ్ళు ఆకాశం నుంచి వానగా కురవడం తెలుసు, నదుల్లో ప్రశాంతంగా ప్రవహించడం తెలుసు, కోపం వచ్చినప్పుడు సునామీలా ముంచెత్తడం తెలుసు, బాధ కలిగినప్పుడు సముద్రాల్లో సుళ్ళు తిరగడం తెలుసు. సరదాగా కొండల మీద నుంచి జలపాతల్లా హైజంప్ చేయడం తెలుసు. కానీ డ్యాన్స్ చేయడం ఏమిటి అనుకుంటున్నారా! మీరు స్కూళ్ళలో స్టేజీపై రంగురంగుల లైట్ల చక్రం తిరుగుతుంటే మ్యూజిక్ కు అనుగుణంగా స్టెప్పులేసినట్లు ఇక్కడ నీళ్ళు స్టెప్పులేస్తాయి. ఎక్కడ? ఎలా? ఇప్పుడు తెలుసుకుందాం!

సెంటోసా ఒక ఎంటర్ టైన్ మెంట్ పార్కు అని తెలుసుకున్నాం కదా! ఇందులో అండర్ వాటర్ వరల్డ్, మోర్ లియాన్ ఇమేజి. హెర్బల్ పార్కు. ఫ్లవర్స్ క్లాక్, డాల్ఫిన్ లాగూన్, బటర్ ఫ్లై అండ్ ఇన్సెక్ట్స్ పార్కు, మ్యూజికల్ ఫౌంటెన్ మొదలైనవి ఉన్నాయి. మీరు ఎదురు చూస్తున్న మ్యూజికల్ ఫౌంటెన్ గురించి మొదట చెప్పి, మిగతా వాటిని తరువాత వివరిస్తాను. మైసూరులోని మ్యూజికల్ ఫౌంటెన్ కన్నా, హైదరబాద్ లోని లేజర్ షో కన్నా వందరెట్లు అందంగా అద్బుతంగా ఉందిక్కడ. మధ్యఓ నీళ్ళు, చుట్టూ వీక్షకులు కూర్చోవడానికి కుర్చీలు వేలసంక్యలో ఉన్నాయి. మ్యూజిక్ బీట్లకు అనుగుణంగా నీళ్ళు పైకి చిమ్మడం, ఆ నెల్లూ వివిధ వర్ణల్లో కనువిందు చేయడం, ఆ వర్ణల్లోనే బొమ్మల ఆకారాలు కన్పించడం, అవి డాన్స్ చేయడం కనిపిస్తాయి. ఈ ఫౌంటెన్ కు బ్యాక్ గ్రౌండ్ లో ‘మోర్ లియాన్’ కనిపిస్తుంటుంది. మోర్ లియాన్ అంటే తలభాగం సింహం లగాను. తోక భాగం చేప ఆకారంలోను ఉంటుంది. దాని కళ్ళలోంచి ఎరుపు, పసుపు, నీలం మొదలైన రంగుల్లో లైట్ల ఫోకస్ వస్తుంటుంది. ఈ లైట్ల ఫోకస్ నీళ్ళ మీద మన మీద పడుతూ పబ్ ల్లోని డాన్స్ ఫ్లోర్ లను గుర్తుకు తెస్తుంది. నీళ్ళు పైకి ఎగచిమ్మడం అనేది వివిధ రకాల థీమ్స్ తో తయారు చేశారు. సినిమాల్లో హీరో హీరోయిన్లు పాటలు పాడుతూ నర్తించినట్లుగా అన్పిస్తుంది మనకు. ఆ నీళ్ళు పైకి క్రిందకూ ప్రక్కలకూ అలల్లా వంకర్లుగా కదులుతూ ఉంటే. ప్రక్క ప్రక్కన ఉండే రెండు నీతి గొట్టాల నుండి వెలువడే నీరు వేరు వేరు ఎత్తులతో ఉండడం, తక్కువ ఎత్తులో ఉన్నది వంకులతో తిరగడం వల్ల, అవి రెండూ హీరో హీరోయిన్లుగా వంకర్లు తిరుగుతూ ఉన్నది. అమ్మాయి సిగ్గుగా కనిపిస్తుంది. నిలువుగా, వంపులుగా, అడ్డంగా, అలల్లా ఇలా రకరకలుగా నీళ్ళు కదుళ్తూ ఉంటే చేతులు కాళ్ళు కదిలుస్తూ నృత్యం చేసినట్లు అనిపిస్తుంది. ఎంతో సుందరమైన అతి మనోహరమైన ఈ దృశ్యం చూసి ఆనందించడమే తప్ప ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు.

ఇప్పుడు అండర్ వాటర్ వరల్డ్ చూద్దాం. ఇదొక సొరంగంలా ఉంది చుట్టూతా అద్దాలు ఉంటాయి. నెత్తిమీద, కాళ్ళ కింద కూడా అద్దాలు ఉంటాయి. అద్దాల వెనక నీళ్ళు, ఆ నీళ్ళలో రకరకాల చేపలు ఉంటాయి. పార్కులు, రే చేపలు, జెల్లీ ఫిష్ లు, సీహార్స్ లు, విద్యుత్ చేపలు మొదలైన అరుదైన వాటిని చూశామిక్కడ. మధ్య మధ్యలో చూమి ఏర్పడ్డ విధానం, శిలాజాలు ఎలా ఏర్పడ్డాయి? డైనోసార్లు రాజ్యమెలిన జూరాసిక్ యుగం గురించి, ఆర్కియా ప్టెరిక్స్ లాంటి సజీవ శిలాజాల గురించి ఎన్నో విషయాలు వ్రాసి ఉన్నాయి. కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం పెద్ద విస్పోటనం జరిగి ఈ భూగోళం ఏర్పడింది. అప్పుడు ఇది మండుతున్న వాయుగోళం. అది క్రమంగా చల్లారి నీతి ఆవిరి ద్రవరూపంలోకి మారి సముద్రాలు ఏర్పడి. ఆ తరువాత ఆ నీట్లోంచి జీవజాలం ఆవిర్భవించింది. ఇవన్నీ చదివి, ఈ సముద్ర జీవుల్ని చూస్తుంటే నేను బియస్సీ లో చదువుకున్న జువాలజీ పాఠం మొత్తం కళ్ళముందున్నట్లనిపించింది. ఇవన్నీ చదువుకునేటప్పుడే చూసి ఉంటే పరీక్షల్లో ఇంకా ఎక్కువ మార్కులు వచ్చి ఉండేవేమో!

ఉప్పునీటి  మడుగులో డాల్ఫిన్లు అదే ఆటలు ఎంతో సరదాగా ఉంటాయి. బాల్ విసిరేస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళి మూతి మీద పెట్టుకొని తీసుకురావటం. చప్పట్లు కొట్టడం వంటి పనులన్నీ చేస్తాయి డాల్ఫిన్లు. హెర్బల్ పార్కులో మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ దర్శనమిస్తాయి. బటర్ ఫ్లై అండ్ ఇన్సెక్ట్ పార్కులో ప్రపంచంలో ఎన్ని రకాల సీతాకొక చిలుకలు, కీటకాలు ఉన్నాయో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది. “ప్లవర్స్ క్లాక్” లో పువ్వులతో తయారైన గడియారం ఉంటుంది. వీటన్నింటి మధ్యలో రెస్టారెంట్లు ఉన్నాయి. ఒకచోటు నుండి మరొక చోటుకు వెళ్లడానికి బస్సులు ఎక్కి వెళ్ళాలి. అంటే వీటి మధ్య అంతదూరం ఉంటుందన్న మాట. బస్సులు ఎక్కేదగ్గర ఇనుపకడ్డిలతో లైన్లు కట్టబడి ఉంటాయి. బస్సెక్కలంటే అందరూ లైనులో వెళ్ళవలసిందే. మేము ఒకచోట క్యూలో నిలబడి ఉన్నప్పుడు మా ప్రక్కనున్నతను ‘ఇదే ఇండియాలో అయితే వీటి కింద నుంచి దూరో, పై నుంచి గెంతో ఎప్పుడో దాటేవాళ్ళు, క్యూలో మాత్రం ఉండేవాళ్ళు కాదు’ అని హిందీలో ఆ ప్రక్కనున్నతనితో అంటున్నాడు. ‘మీరు ఇండియా నుంచి వచ్చారా?’ అని మేమడిగితే ‘లేదు నేను నేపాల్ నుంచి వచ్చాను. ఇండియా చాలా సార్లు చూశాను’ అన్నాడు. మన డిసిప్లిన్ గురించి బయటివాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారా! అని చాలా బాధనిపించింది. పిల్లలూ! రేపటి పౌరులైన మీరు క్రమశిక్షణతో వ్యవహరించి భవిష్యత్తులో ఇండియాకున్న ఇలాంటి పేరు పోగొట్టాలి. మంచి పేరు తీసుకురావాలి.

అయ్యో! ఇంతకూ 4డి మ్యాజిక్స్ గురించి చెప్పనేలేదు మీకు. ఇది చాలా సరదాగాను, గమ్మత్తుగానూ ఉంటుంది. మామూలుగా చాలా చోట్ల కనిపించే 3డి సినిమాలనే ఉంటుందిలే. దీన్ని చూడ్డం ఎందుకు? అనుకుంటూ లోపలికి వెళ్ళాం. అయితే ఇది వాటన్నింటికీ చాలా భిన్నంగా ఉంది. సినిమాలో సముద్రప్రయాణం ఉంటే, మనకు కూడా చల్లని పిల్లగాలి వాస్తు మనమే ప్రయాణం చేస్తున్న అనుభూతి కలిగింది. అందులో కాళ్ళ కింద కొన్ని వందల పురుగులు పారాడుతున్నట్లనిపించి అందరూ కాళ్ళు సీట్లపై పెట్టుకున్నారు. సినిమాలో వర్షం వచ్చి వాళ్ళు తడిసిపోతుంటే పై నుంచి నీతి తుంపరులు పడుతూ థియేటర్ లో ఉన్న వాళ్ళంతా తడిసిపోయాం. తెరపై కందిరీగలు ఒక్కసారిగా ముసురుకుంటూ మీద మీదకు వస్తుంటే, ‘ష్ ష్’ అంటూ చేతులతో తొలని వారు లేరు. సినిమాలో కత్తులతో పొడుచుకుంటూ కట్టుల్ని కళ్ళ దగ్గరగా పెడితే, మన కళ్లలోకి దిగబడుతున్నట్లే అనిపించి అందరూ తులలు ప్రక్కకి తిప్పారు. సీట్లు ఎగిరిపడటం సీట్ల కింద ప్రక్కల నుంచి గాలి వచ్చేలా ఏర్పాట్లు, సీట్ల కింద భాగం ఊగటం ఇలాంటి అరేంజ్ మెంట్స్ తో పాటు సౌండ్ ఎఫెక్ట్ తో నిజంగా మనమే సినిమాలో నటిస్తున్నట్లనిపించింది. నచ్చిందా పిల్లలూ! మీరు చూస్తారు కదూ!