''ఆ '' ఇద్దరు :- టి వేదాంత సూరి ప్రకృతి చాల విచిత్రంగా మారుతుంది.. అలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మొన్న ఫోటోల పార్క్ వెళ్ళినప్పుడు , మరు నాడు కౌంట్ డౌన్ వద్ద వున్నా ప్లే గ్రౌండ్ తీసుకెళ్తామని ఆద్యకు చెప్పాం . 
మరునాడు ఎప్పుడు  వెళదాం అని ఆద్య అడగడం ప్రారంభిచింది సాయంకాలం వెళ్ళడానికి సిద్ధం కాగానే , బయట పెద్ద వర్షం మొదలైంది. ఏం చేయాలి.
ఇంట్లో  బొర్ వస్తుందని పిల్లలను జారా వద్దకు తీసుకెళ్లారు. కానీ జారాకు కాస్తా జలుబు చేసిందట. పడుకొని వుంది. కాసేపు అక్కడ ఆడి , ఇంటికి వచ్చారు. 
ఆద్యకు పుస్తకాలు చదవడం, బొమ్మలు వేసికోవడం ఇష్టం, ఆరియాకు అల్లరి చేయడం, తన భావాలను హావభావాలతో వ్యక్తం చేయడం అలవాటు. 
తాను సర్ప్రైజ్ స్టార్ అని చెప్పుకుంటుంది. కానీ ఆ మాట మనకు చంపేస్తా  అని  వినిపిస్తుంది. ఎన్ని సార్లు అడిగినా పదే పదే అదే చెప్పేస్తుంది. ఈ మధ్య కొన్ని పదాలు కొత్తవి కూడా నేర్చుకుంటుంది.నానమ్మను  నామ్మ అంటుంది. మధ్యాహ్నం పడుకొని లేవగానే.. హాగ్ ఇవ్వమని అడుగుతుంది. 
(మరిన్ని ముచ్చట్లు రేపు)