గోళీలాట: -సత్యవాణి

 గోళీలాట ఆడుదమా

గాజు గోళీలాట ఆడుదమా

బెత్తా జానా మూరలు కొలిచే 

గోళీలాటా ఆడుదమా

గాజు గోళీలాటా ఆడుదమా

గుంటను లోనికీ గురిచూసీ

గోళీలను కొట్టే ఆటఇది

సునిసితముగ మన దృష్టిని పెంచే

సుఖకరమైన ఆటఇదీ

పిల్లకు పెద్దకు తేడాలేనీ

ప్రియకరమైనా ఆటఇదీ

పల్లెను విడచీ పట్నం చేరని

ప్రమోదమైనా ఆటఇదీ

బల్ ప్రమోదమైనా ఆట ఇదీ