మల్లెపూలు , మల్లె చెట్టు - ఔషధ గుణాలు..:- పి . కమలాకర్ రావు

 మల్లె పూలతో నిండిన మల్లె చెట్టుకమ్మని  సుగంధాన్ని వెదజల్లుతుంది. మల్లెల గుబాళింపు మనసును ఆహ్లాద పరుస్తుంది. మధురానుభూతులను కలిగిస్తుంది మల్లెపూలతో పాటుగా దీని ఆకులు వేరు ఎన్నో ఔషధగుణాలను కలిగి ఉన్నది.
మల్లె ఆకులు సూక్ష్మజీవులను నిర్మూలిస్తుంది. వాపులను తగ్గిస్తుంది.  మళ్ళీ ఆకుల కషాయం తయారుచేసి చల్లార్చి నోట్లో పోసుకొని పుక్కి లిస్తే  నోటి పుండ్లు తగ్గిపోతాయి. చిగుళ్ల వాపు కూడా తగ్గిపోతుంది. ముఖ పక్షవాతం వచ్చినవారికి  మల్లె చెట్టు వేరును దంచి కొబ్బరి నూనె వేసి తైలంగా కాచి ముఖంపై
 మెల్లగా మర్దనా చేస్తే ముఖ పక్షవాతం తగ్గిపోతుంది. మల్లె ఆకుల కషాయం తాగితే కడుపులోని క్రిములు నశిస్తాయి.
మల్లె ఆకులను ముద్దగా నూరి కొద్దిగా పసుపు కలిపి ఆముదం వేసి  తైలంగా కాచి నిల్వచేసుకోవాలి. దీన్ని  ఆనెలపై  పూసుకుంటే కొద్ది రోజులలో ఆనెలు   కరిగిపోతాయి. బాలింతలకు స్తనాల్లో  వాపు వచ్చినా కూడా ఈ నూనెను లేపనంగా పూస్తే వాపు తగ్గి పోతుంది. నొప్పులు  కూడా తగ్గిపోతాయి.
 మల్లెపూలను ముద్దగా నూరి ముఖంపై ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం  పై   మంచి మెరుపు కాంతి వస్తుంది.
కామెంట్‌లు