సాక్షి శతకము: - బెహరా ఉమామహేశ్వర రావు

 

      అజ్ఞానమనగా తమమును/
       సుజ్ఞానంబనగా మంచి సుగుణ ములనియున్/
       ప్రజ్ఞయు ధైర్యస్థైర్య కృ/
       తజ్నతయును లోనిమిడ్చితివే సాక్షీ//(27)
        ప్రాణ పానవ్యాన ఉ/
         దాన సమానంబులనగ తత్తుల్యముగన్/
          మానస సంకల్పం బుల్లోడు/
           లోనే స్థానంబునిచ్చి లీలను సాక్షీ (28)
బాహ్యంతరేంద్రియంబులు/
వహ్వాయనునట్లు దాని కవియేవదిగా /
సహకారమేమి లేకను/
మహనీయాజ్ఝ తలదాల్చి మెలగును సాక్షీ//(29)
      జీవులు సృష్ట గు సమయము/
      నీ వెరుగని వేళగాదు నిజమా మీదన్/
      జీవింబిడి ఆ జీవికి/
      ఏవేవో కర్మ బంధ మేర్పడు సాక్షీ//(30)