*అ* మ్మలాంటి మాబడి
*ఆ* త్మీయతగల ఒడి
*ఇ* ల్లులాంటి మా బడి
*ఈ* వి నేర్పు మాబడి
*ఉ* త్సాహం పెంచెడి
*ఊ* డమర్రి మాబడి
*ఋ* షివాకిలి మాబడి
*ఎ* రుక తెలుపు మాబడి
*ఏ* టిప్రక్క మాబడి
*ఐ* క్యతనే పెంచెడి
*ఒ* జ్జలుండు మాబడి
*ఓ* ర్పు నేర్పు మాబడి
*ఔ* ను ఔను మాబడి
*అం* చలున్న చావడి!
అచ్చుల బడిగేయం:-కిలపర్తి దాలినాయుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి