ఆక్లాండ్ లో అందరికి వేసవి సెలవులు అని చెప్పుకున్నాం కదా. ఇంటి వద్దనే అందరూ ఉండటం తో ఆద్య, ఆరియా బాగా ఆడుకుంటున్నారు. వాళ్ళ అమ్మ ఫ్రెండ్ వినీల అంటి, విజయ్ అంకుల్, వాళ్ళ చిన్నారి పాప జార ఇంటికి వచ్చారు. వచ్చిన వారందరికీ ఆరియా టీ పెట్టి ఇచ్చింది. మైక్రో ఓవెన్ లో కప్ పెట్టడం తెచ్చి ఇవ్వడం, ఇక అదే పని. ఆద్య కూడా జారా తో బాగా ఆడింది. జార నాలుగున్నర నెలల పాప అప్పుడే బోర్లా పేరుతో చెద్దరు లో చుట్టూ తిరుగుతుంది. వాళ్ళ అమ్మ మాట గుర్తుపడుతుంది. ఎత్తుకుంటే వొడిలో ఎంతసేపైనా పడుకుంటుంది. కానీ బెడ్ పై పడుకోపెడితే లేచి ఏడుస్తుంది.అవును నిన్న బేబీ కిచెన్ కబుర్లు తెలిసి వారి వంటలు రుచికరంగా ఉన్నట్టు ప్రహ్లాద్ తాతయ్య మెసేజ్ చేశారు. ఇక అది చదివితే తమకు ఎన్నెన్నో జ్ఞాపకాలు వస్తున్నట్టు కెనడా లో ఉంటున్న షర్మిల అత్తమ్మ, సునీతా అత్తమ్మ చెప్పారు.అవును కదా. పిల్లలు ఆడుకునేవి అవే కదా. పిల్లలను, వారి ఆట పాటలు చూస్తుంటే ప్రతి వారు తమ బాల్యం లోకి వెళ్లి పోవలసిందే.జారా వాళ్ళు రాత్రి వరకు వుంది వెళ్లి పోయారు. ఇంట్లో అందరు ఉండటం వాళ్ళ ఆద్య, ఆరియా రాత్రి కాస్త ఆలస్యంగానే పడుకుంటున్నారు. ఆరియాకు నిద్ర వచ్చిందంటే ఆగదు . .నానమ్మ కొంగు పట్టుకుని చుట్టూ తిరుగుతుంది. అది అర్థం చేసుకుని బాటిల్ తీసుకెళ్లి పాలు పడితే క్షణం లో నిద్ర పోతుంది.(మరిన్ని ముచ్చట్లు రేపు)
''ఆ '' ఇద్దరు : టి. వేదాంత సూరి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి