జండా వందనం--డా.కె .ఎల్ .వి.ప్రసాద్ ,-హన్మకొండ .


 జండావందనము 

మన జండా 

పండుగ రోజున 

జండావందనం ..!


జాతీయ పతాక 

ఎగురవేసే 

జండా పండుగ రోజున 

అందరికీ వందనము  !


స్వాతంత్ర్య -

సమరయోధులను 

గుర్తు చేసుకుందాము !


మనకోసం ....

మనదేశం కోసం 

ప్రణాలర్పించిన 

త్యాగధనులను ...

స్మరించుకుందాం !


రాజ్యాంగం రచించి 

ఇచ్చిన 

అంబేద్కరును 

గుర్తుచేసుకుందాం !


సత్యాగ్రహమే 

ఆయుధంగా 

పోరాడిన గాందీజీ 

శాంతిదూత నెహ్రు జి ,


జైజవాన్ ..జైకిసాన్ 

నినాదం చేసి న 

శాస్త్రీ జీ ....


ఉక్కుమనిషి పటేల్ ,

గరీబీ హాటావో అని 

నినదించిన ఇందిరమ్మ 


ఇలా ఎందరెందరో ..

మహానుభావుల 

సేవలను స్మరించుకుందాం !


గగన సీమలో 

రెప రెపలాడే 

మువ్వన్నెల జెండాకు 

మనఃస్పూర్తిగా 

సలాం చేద్దాం ...

'రిపబ్లిక్ డె'దినోత్సవాన్ని 

సగర్వంగా జరుపుకుందాం !!


       ----

ఫొటోలో---:బేబి ఆన్షి.నల్లి.

కామెంట్‌లు