ఠక్కున చెప్పండి.--పురాణప్రశ్నలు-సమాధానాలు.:-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.


 1) ధుర్యోధనుని పాండవులుకోరిన ఐదుఊళ్ళలో నాలుగుఏవి? 

2)చతుర్విధాశ్రమాలు అంటే ఏవి?

 3)మహారథుడు అని ఎవరిని అంటారు?

 4)అతిరథుడు అని ఎవరిని అంటారు?

 5)సమ రథుడు అని ఎవరిని అంటారు?

 6)అర్ఢరధుడు అని ఎవరిని అంటారు?

 7)కుంభకర్ణుడు ఏఅస్త్రంతో మరణించాడు?

 8) దండము-భోగము-మండలము-అసంహితము అంటే ఏమిటి?

9) శ్రీకృష్ణుడు నాగ్నజితి ల సంతతి ఎందరు?

10)తారకాసురుని తల్లిపేరేమిటి? 

సమాధానాలు: 1)ఇంద్రపస్తము-భృగుపస్తము-వారణావతము-జయంతము. 2) బ్రహ్మచర్యం-గృహస్ఢం-వనప్రస్ఢం-సన్యాసం.3) తనను సారధిని,గుర్రాలను కాపాడుకుంటూ,పదకొండువేల విలుకాండ్రతో యుద్ధంచేయగలిగినవాడు.4)పలువురితో ఒకేసారి యుధ్ధంచేసేవాడిని. 5)ఓక్కడితో పోరాడేవాడిని. 6) తనంతటి వారితో పోరాడేవారిని.7) బ్రహస్త్రం.8) యుద్ధరంగంలో సైన్యం నిలిపేవిధానం.9)తొమ్మిదిమంది కుమారులు-ఒకకుమార్తే. 10)వజ్రాంగి.