సోరియాసిస్ తగ్గడానికి... :పి . కమలాకర్ రావు
 సోరియసిస్ అనే చర్మ వ్యాధి తగ్గడానికి శారీరక పరిశుభ్రత చాలా పాటించాల్సి ఉంటుంది. తలపై చుండ్రు ఉంటే ఈ వ్యాధి మరింత పెరిగే అవకాశం ఉంది
 కొన్ని దవనం ఆకులు మరియు అతిమధురం పొడి కొబ్బరి నూనెలో  వేసి రాత్రంతా నాననిచ్చి మరు రోజు ఉదయం తైలంగా  కాచి  చల్లార్చి ప్రతిరోజు తలకు రాసుకోవాలి. చుండ్రు తగ్గిపోతుంది
 కొన్ని వేపాకులు  పసుపు నీళ్లలో వేసి మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా ప్రతిరోజూ చేయాలి.
కొన్ని పారిజాతం ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి కషాయం చేసి చల్లార్చి ప్రతిరోజు త్రాగాలి. ఇలాగే నేలవేము ఆకుల కషాయం కూడా త్రాగాలి. నేలవేము ఆకుల పొడి కూడా ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. అర స్పూన్ పొడినివేడి  నీటిలో వేసి  గోరువెచ్చగా త్రాగాలి. ఇలా కొన్నాళ్ళు చేస్తే సోరియాసిస్ వ్యాధి తగ్గుముఖం పడుతుంది.