ఎక్కడిదమ్మా ఈ కోతీ:-గంగదేవు యాదయ్య
 ఎక్కడిదమ్మా ఈ కోతీ
ఇక్కడి కెందుకు వచ్చింది
కొండలదమ్మా ఈ కోతీ  
కొబ్బరి  కొరకూ వచ్చిందీ
చెన్నై దమ్మా ఈ కోతీ
శనిగల కొరకూ వచ్చిందీ
ఢిల్లీ దమ్మా ఈ కోతీ
పల్లీ కొరకూ వచ్చిందీ
ముంబై దమ్మా ఈ కోతీ
మురుకుల కొరకూ వచ్చిందీ
పట్నం దమ్మా ఈ కోతీ
కట్నం కొరకూ వచ్చిందీ
ఎక్కడిదమ్మా ఈ కోతీ
ఇక్కడికెందుకు వచ్చింది
అమెరికదమ్మా ఈ కోతీ
అరిసెల కొరకూ వచ్చిందీ
లండనుదమ్మా ఈ కోతీ 
కొండల కొరకూ వచ్చిందీ
ఎక్కడిదమ్మా ఈ కోతీ
ఇక్కడికెందుకు వచ్చిందీ
( *ఉయ్యాల - జంపాల పుస్తకం* నుండి )
 
కామెంట్‌లు