పచ్చని సంక్రాంతి:--డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 దినకరుడు మకరరాశిలోకి‌ ప్రవేశించే వేళ మకరసంక్రమణం.
భోగభాగ్యాలనిచ్చే భోగినాడు
చలిని దూరం చేసే భోగిమంటలతో,రథం ముగ్గులతో సూర్యనారాయణునికి‌ పాయసాన్న నైవేద్యాలు.
పిల్లలకున్న పీడలను‌ తరిమివేసే భోగిపళ్ళతో సంబురాలు.
ఉత్తరాయణ పుణ్యకాలంలో నదీస్నానాలు,పితృతర్పణలతో
కృతజ్ఞతాంజలులు ఘటిస్తారు.
ఇంటిముందు,వాకిళ్ళలో‌‌ తీర్చిదిద్దే ముగ్గులు,గొబ్బెమ్మలతో మరింత శోభాయమానం.
పిల్లా,పెద్దా గుముగూడి పతంగులు ఎగరవేసే సరదాలు.
హరిదాసులు సంకీర్తనలతో,
గంగిరెద్దుల వారు విన్యాసాలతో అలరిస్తారు.
పచ్చని పొలాలు సమృద్ధిగా ధాన్యరాసులివ్వగా,
రైతుల ఆనందాలు.
కోడిపందాలు,ఎడ్లపందాలు సరేసరి.
విందు భోజనాలు,బంధుమిత్రుల
సందడులు.
నోములు నోచుకొనే సౌభాగ్యాలు.
పాడిపశువులకు కృతజ్ఞతగా కనుమ‌ అలంకరణలు,పూజలు.
పేరంటాలతో ముక్కనుమ నాడు ముగింపులు.