బాలగేయం: -సత్యవాణి
 బొమ్మలమ్మ బొమ్మలూ
కొండపల్లి బొమ్మలూ
బొమ్మలమ్మ బొమ్మలూ
నక్కపల్లి బొమ్మలు
బొమ్మలమ్మ బొమ్మలూ
ఏటికొప్పాక బొమ్మలూ
పిల్లలు పెద్దలు మెచ్చే
రంగు రంగుల బొమ్మలు
కర్రతోటి చేసేటి
కడు రమ్యమైన బొమ్మలు
ఆడపిల్లలాడుకొనె లక్కపిడతలు
పిల్లలు పెద్దలు ఆడే చదరంగ బిళ్ళలూ
బాజా భజంత్రీలు భజన బృందము
శ్రీరాముని పట్టాభిషేకం
సైనికవిన్యాసం
ఎన్నెన్నో బొమ్మలు
రకరకాల బొమ్మలు
భారతీయత ఉట్టిపడే
పలు పసందైన బొమ్మలు