పిల్లలం పిల్లలం చదువులోన పిడుగులం .
పువ్వులం పువ్వులం పరిమళించు నవ్వులం.
మా బడి అంటే మా కిష్టం .
మా గుడి అంటే మరీ ఇష్టం .
పిల్లలం పిల్లలం చదువులోన పిడుగులం .
పువ్వులం పువ్వులం పరిమళించు నవ్వులం .
అలసట అసలే తెలియదు .
ఆటలంటే ఆకలే తెలియదు .
చినుకు లోన చిందులేస్తాం .
మెరుపు లోన మెరిసి పోతాం .
ఇంద్రధనస్సు రంగులు చూస్తాం .
నీలి మబ్బుల పరుగులు చూస్తాం .
సీతా కోక చిలుకలం .
మొలకెత్తే మొలకలం .
పిల్లలం పిల్లలం చదువులోన పిడుగులం.
పువ్వులం పువ్వులం పరిమళించు నవ్వులం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి