ఆమడ దూరంనుచేసువాసనలు గాలిని
సుగంద భరితం చేస్తుా
ఆహ్వానం పలుకుతాయి
మరుమల్లెలు
అభిమన్యుడిలా ట్రాఫిక్ కి
అడ్డంపడుతూ దూసుకొస్తాడువాడు
వెండి వెన్నెల జలపాతాలవంటి
మల్లెల మాలలను
మోచేతులపై జారవేసు కొని
అక్కా మల్లెలు
అక్కా మల్లెలు కొనక్కా
బావా మల్లెలు
బావా మల్లెలు కొను బావా
అత్తా మల్లెలు
అత్తా మల్లెలు కొనత్తా
మావా మల్లెలు
మావా మా అత్తకు
మల్లెలు కొను మావా
నిమిషంలో వరుసలు
కలిపేస్తాడు
మాటలతో బులిపించేస్తాడు
మాలలు కొనిపించేస్తాడు
మాటల మాంత్రికుడే కాదు
వాడు చేతల మాంత్రికుడుకూడా
అరక్షణంలో
మాటలకు సుగంధాలద్ది
మైమరపించి
అర మూరను ఒడుపుగా
మూరను చేసేస్తాడు
మా మల్లెలబ్బాయ్
మాటలను
మరు మల్లె దండలను కలిపి
పొట్లంలో చుట్టి అమ్మేస్తాడు
వాడు బహు చతురుడు
మల్లెలబ్బాయి : - సత్యవాణి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి