కడలి:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 అమ్మో నీరు
అమ్మమ్మో నీరు
ఇంతనీరు ఎక్కడా
కనబడునే తీరు
నీరంతా ఒకచోట
ఒలకబోసినారొ ఏమో
అంతులేని జలరాశి కొసన
భూమి ఉందొ లేదొ ఏమో
అదిగో అదిగదిగో
కనుచూపు మేరలోన
నింగీ నీరు కలుస్తున్నవేమో
అందాలను ఒలుకుతున్నాయ్
కనువిందులు చేస్తున్నాయ్
నీటిలోని కెరటాలకు
ఎంతపొగరొ ఏమో కాని
పరుగులేమో పెడుతున్నాయ్
లేస్తున్నాయ్ పడుతున్నాయ్
పడినా తిరిగి లేస్తున్నాయ్
మనకు పాఠం చెబుతున్నాయ్ !!
 
కామెంట్‌లు