పొడుపు కథలు: --డా. కందేపి రాణి ప్రసాద్


            

1 కాటుక రంగు పిల్లల్ని

కడుపులో దాచుకున్న

మిసిమి మేను గల అమ్మ

ఎవరా అమ్మ ?ఎవరా పిల్లలు?


2 ఒంటినిండా పొరల చీరలు

తెలుపు ఎరుపు రెండు రకాలు

ఇవి లేనిదే చేయరు కూరలు

తల్లి కూడా చేయదు ఇలా మేలు


3 కాగితాలు ఉండ చుట్టి నట్లుగా

ముడతల మధ్య దాగిన సిగ్గరి

క్యా బే అని హుంకరి

జవాబులు

1 బొప్పాయి

2 ఉల్లిపాయ

3 క్యాబేజీ 

కామెంట్‌లు