'' ఆ '' ఇద్దరు : టి. వేదాంత సూరి
 ఆద్యకు అత్తయ్య వద్ద ఉండటం చాలా ఇష్టం. మొన్న ఇంటికి  వచ్చేప్పుడు రేపు మళ్ళీ వస్తానని చెప్పిందట. మరు నాడుఆద్య  అమ్మ నాన్నతో కలిసి బయటకు వెళ్ళింది. అదే సమయం లో అత్త కాల్ చేసి మరిచి పోయావా ఆద్య వస్తా అన్నావ్ అని గుర్తు చేసిందట. దీంతో అమ్మ, నాన్న తో 'తాను ఇంటికి రానని, అత్తమ్మ వద్ద తనను వదిలి పెట్టమని' చెప్పింది. 

వాళ్ళు ఆద్యను అత్తమ్మ వద్ద వదిలి వచ్చారు ,అక్కడ ఆద్య  పొద్దంతా బాగా ఆడుకుంది, సాయం కాలం ఆరియా కూడా అక్కడికి వెళ్ళింది, ఇద్దరు కలిసి టబ్ బాత్ చేశారు. సబ్బు నురగలో ఆడుకుంటూ కేరింతలు కొట్టారు. తరువాత కూల్ డ్రింక్ తాగి కాసేపు టి. వి. చూసారు. 

ఇక వెళ్ళొస్తా అత్తమ్మ అని ఆద్య చెప్పింది. ''అర్ యు హాపీ నౌ'' అని  ప్రశ్నించింది . 

అంటే అందరిని సంతృప్తి పరచడం ఆద్యకు ఇష్టం, ఇంటికి వచ్చ్చాక పుస్తకాలతో కాలక్షేపం చేసింది. ఎవరు బయటకు వెళ్లినా ఆద్యకు ఒక పుస్తకం, ఆరియాకు ఒక బొమ్మ తెస్తారు.

 ఇక్కడ రక రకాల పుస్తకాలు దొరుకుతాయి. అవన్నీ పిల్లలు చాలా ఇష్ట పడతారు. వాటిని పదే పదే చదువుకుంటారు. 

మరి మన వద్ద ఇలాంటి మార్పు ఎప్పుడు వస్తుందో అనిపిస్తుంది. తల్లిదండ్రలు తమ పిల్లలకు ఎంత ధర వున్నా మంచి పుస్తకాలు కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చే అలవాటు చేయాలి. అదే విధంగా రచయితలు తమకు ఇష్టం వచ్చిన కథలు కాకుండా పిల్లలకు నచ్చేవి రాయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు తెలుగు లోనూ మరింత మంచి బాల సాహిత్యం రావలసిన అవసరం వుంది. అందుకు ప్రచురణ కర్తలు కూడా సహకరించి రచయితలను ప్రోత్సహించాలి. 

( మరిన్ని ముచ్చట్లు రేపు )