దోస్థానా ..: --కె.ఎల్వీ.


 ప్రతివాళ్ల చేతిలోనూ ,

స్మార్ట్ _ఫోన్ ఇప్పుడు,

ఆభరణంఅయిపోయిన్ది,

అది లేకున్టే....

జీవితమే_

అయోమయంఅయ్యేట్టున్ది!


ఇందులో _

ఫేస్ బుక్ _వాట్సాప్ ,

పక్కన పెడితే.....

ఫ్రెండ్ రిక్వెస్ట్ ల 

మోతాదు ...

మెండుగా ఉంటుంది !


పొరపాటున ,

తెలియని వ్యక్తిని ,

స్నేహం మత్తులో ...

ఆమోదించామా _

ఒక్కోసారి ......

మగవాళ్లు _ఆడవాళ్ళుగా ,

ఆడవాళ్లు _మగవాళ్ళుగా ,

అందమైన ఫోటోలతో ...

ముసుగు వేషాల్లో ,

ప్రత్యక్షమౌతుంటారు !


ఆడవాళ్లుగా ...

అవతారం ఎత్తిన 

మ     గా      ళ్లు ,

అమ్మాయిలానే ...

మిమిక్రీ మెసేజిలు ఇస్తారు,

ఎదుటి వారి బలహీనతను ,

సొమ్ము చేసుకుంటూ ...

నమ్మకాన్ని జయించి,

నకరాలు ...

మొదలెడతారు ...!


అందచందాలను ...

మెచ్చుకుంటూ ,

తదుపరి _

అంగాంగాలను ...

వర్ణించడం _

మొదలు పెడతారు ,!


తమను తాము ...

మోసంచేసుకుంటూ ,

ఎదుటివారిని _

మోసం చేస్తారు ,

పవిత్రమయిన స్నేహానికి,

చిల్లులు పొడిచేస్తారు !


ఏదైనా __

సద్వినియొగం చేసుకుంటె ,

అది అపూర్వం ...!

లేకుంటె __అది 

చెప్పలేనంత అపాయం !!

     

కామెంట్‌లు