మైసూరు ప్యాలెస్: -- డా.. కందేపి రాణీప్రసాద్.


 పిల్లలూ ! మైసూరు ప్యాలెస్ గురించి ఎప్పుడైనా విన్నారా.? రంగురంగుల విద్ద్యుద్దిపాలతో కళ్ళు చెదిరే అలంకారాలతో, నాయనానందకరంగా శోభను కలిగించే కోట బహుశ ఇదొక్కటేనేమో. మైసూరు సిల్క్ చీరలు, మైసూరు శాండల్ సబ్బులు. మైసూరు పాక్ ఇవీ మైసూరుతో సంబంధమున్నవని వినే ఉంటారు. ఈ రోజు మైసూరు పట్టణం గురించీ, మైసూరు ప్యాలెస్ గురించీ తెలుసుకుందామా !

మైసూరు కర్ణాటక రాష్ట్రంలోని రెండవ పెద్ద పట్టణం. ఇది బెంగుళూరుకు 140 కి.మీ. దూరంలో, సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తున ఉన్నది. ఇక్కడ ఏటా జరిగే దసరా ఉత్సవాలకు ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులు హాజరౌతారు. మహిషాసుర ఊరు అనే పదం నుంచి మైసూరు మైసూరు అనే పేరు వచ్చింది. పూర్వం ఈ ప్రాంతాన్ని మహిషాసురుడనే రాక్షసుడు పరిపాలించేవాడు. ఆ రాక్షసుని అరాచకాలు భరించలేక దేవతలు పార్వతీదేవిని ప్రార్థిస్తే ఆ అమ్మ చాముండేశ్వరిగా అవతరించి, మహిషాసురుణ్ణి సంహరించి కొండపై వెలసిందట. అప్పటి నుంచి ఆ కొండకు చాముండి హీల్స్ అని, ఆ ప్రాంతానికి మహిషాసుర అని పేరు ఏర్పడింది. అదే కాలక్రమేణా మైసూరుగా రూపాంతరం చెందింది.

మైసూరు పట్టణం నడిబొడ్డున మీర్జారోడ్ లో మైసూరు మహారాజుల అద్బుతమైన కట్టడం రాజసంగా నిలబడి ఉన్నాయి. విజయనగర మహసామ్రాజ్యం మైసూరు వడయార్ రాజుల కింద ఉన్న చిన్న రాజ్యం. వడయార్ రాజులు ఈ ప్యాలెస్ ను మొదట చెక్కతో నిర్మించారు. 1897లో అగ్నిప్రమాదం కారణంగా ఈ ప్యాలెస్ నేలమట్టమైంది. తరువాతి వడయార్ రాజులు దీనిని పుర్ణర్నిర్మించారు. క్రీ.శ. 1699 తరువాత చామరాజ వడయార్ మైసూరు పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించాడు. అప్పటి వరకు శ్రీ రంగపట్టణము రాజధానిగా ఉండేది. 1761లో హైదర్ అలీ మైసూరు రాజ్యానికి సేనాధిపతిగా ఉండేవాడు. ఆయన మరణానంతరం ఆయన కొడుకు టిప్పు మైసూరు రాజును పారద్రోలి థాణె సుల్తాను అయ్యాడు. 1799లో టిప్పు మరణించిన తరువాత మరలా ఈ ప్యాలెస్ వడయార్ రాజుల వశమైంది. అప్పటికి కృష్ణరాజవడయర్ ఐదు సంవత్సరాల బాలుడు. ఆయన పట్టాభిషేక మహోత్సవ తైలవర్ణ చిత్రం మైసూరులోని ఆర్ట్ గ్యాలరీలో ఉన్నది. ఆ ఉత్సవానికి బన్సాద్ మహారాజు. వారి యువరాజులు హాజరైనారు. మూడవ కృష్ణరాజ వడయార్ మైసూరును బాగా అభివృద్ధి చేశాడు. వేడల్పైన రోడ్లు. కాలేజీలు, పెయింటింగ్ స్కూల్స్, కోట చుట్టూరా ప్రాకారాలు, కోట ముందున్న సింహద్వారాన్ని నిర్మించాడు. వీటన్నింటినీ చక్కని ప్రణాళికతో మైసూరును అందమైన పట్టణంగా అభివృద్ది చేశాడు. ఈ కార్యక్రమాల్లో రాజుకు శేషాద్రి అయ్యర్, విశేశ్వరయ్య సహకరించారు. ఈ ప్యాలెస్ ఇండో శార్సీ నిక్ స్టైల్ లో కట్టబడింది. అద్భుతమైన నగిషీ చెక్కడాలతో సుందరమైన ఆకృతితో మైసూరు ప్యాలెస్ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నది. చందనపు చెక్కల నగిషీలతో తయారైన కళారూపాలు, శిల్పకళ, జానపద కళలు, సంప్రదాయ చిత్రాలకు పెట్టింది పేరు మైసూరు. అందుకేనేమో మైసూరును కర్ణాటక రాష్ట్రానికి సాంస్కృతిక రాజధాని అంటారు