నా కథ - సంక్రాంతి విడుదల : ఒక నిమిషం నిడివిచిన్న చిన్న భాగాలుగా చేసుకుంటే ఎంత పెద్ద పనైనా ఇట్టే పూర్తయిపోతుంది.ఇదీ కథ***********టెంత్ చదువుతున్నగౌతం గాడికి రేపట్నుండి ప్రిపరేషన్ హాలీడేస్..తల్లీ, కొడుకులు వంటింట్లో కూర్చున్నారు, తల్లి తనముందు నేల మీద కొండలాగ బియ్యం పోసుకొని...వీడు చిన్న కొండలాగ టెక్స్టు బుక్కులు, నోట్సులు ముందేసుకొని..గౌతం వాటికేసి చాలా విచారంగా చూస్తున్నాడు. తల్లి గమనించి, చిరునవ్వుతో ....“ఆడుకోడానికి మనసవుతుంటే కాసేపు ఆడుకొని రా" అన్నది..ఉహు... (గౌతం అడ్డం గా తల ఊపాడు).ఆకలేస్తుందా?.ఉహు....ఒక్కొక్క పుస్తకంలోని పేజీలు ఈ చివరనుండి ఆ చివరకు త్రిప్పుతూ నిరాశ పడుతున్నాడు. వాడి ముఖంలో "టెన్షన్"..తల్లి గమనించింది. పక్కనే వాడ్రాసిన ఎగ్జాం ప్రిపరేషన్ పేపర్లన్నీ చూసింది. వాటిపై టీచర్లు ఇంప్రూవుమెంటని రాశారు..తల్లికి అర్ధమయ్యింది..అటు కూర్చున్న వాడిని ఇటు తిప్పుకొని చూపిస్తోంది. పెద్ద బియ్యం కొండ నుండి చిన్న చిన్న భాగాలు చేసింది. ఒక్కొక్క భాగం నుండి రెండు మూడు రాళ్ళేరి బియ్యాన్ని డబ్బాకెత్తేసింది. కొన్ని భాగాల్లో అయితే రాళ్ళే లేవు,.నిముషాలలో కొండలాంటి బియ్యం కుప్ప కరిగిపోయి డబ్బా నిండిపోయింది..డబ్బా లోపలికి తల పెట్టి, అంత బియ్యం చూసి గౌతం గాడి కళ్ళు మెరిశాయి!.వాడికి వెయ్యేనుగుల బలం వచ్చింది. టెక్స్టు పుస్తకంలో నచ్చినచోటల్లా బుక్ మార్క్సు పెట్టుకున్నాడు..ఒక్కొక్క భాగంలో తక్కువ పేజీలు చూసుకొంటూ ఒక్కొక్క పేజీ శ్రద్ధగా చదివేస్తూ పేజీలు తగ్గించేసుకొంటున్నాడు. చిన్న చిన్న భాగాలు చేసుకుంటే ఎంత పెద్ద పనైనా అయిపోతుందని తెలుసుకున్నాడు..(సమాప్తం)
నేను వ్రాసిన కథపై లఘు చిత్రం : శ్రీ సత్య గౌతమి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి