బొగ్గు ఎలా తయారవుతుంది: -- ౼ దార్ల బుజ్జిబాబు

  ఒకప్పుడు  శక్తి వనరుగా బొగ్గును బాగా ఉపయోగించేవారు. జల విద్యుత్తు రాక పూర్వం  బొగ్గు ద్వారానే  విద్యుత్ తయారు చేసేవారు. దీన్ని థర్మల్  విద్యుత్  అంటారు. డీజిల్, విద్యుత్ రైళ్లు రాక ముందు బొగ్గు ద్వారానే రైళ్లు నడిచేవి. పెద్దపెద్ద బాయిలర్లలో బొగ్గును మండించి. దీనిద్వారా విడుదలయ్యే శక్తితో రైళ్లను నడిపేవారు. సిమెంట్ తయారిలో కూడా ఈ బొగ్గును ఉపయోగిస్తారు. ఇనుప ఖనిజం  కరిగించటానికి ఇనుము - ఉక్కు కర్మాగారాలలో  ఈ బొగ్గునే వినియోగిస్తారు. అసలు ఈ బొగ్గు ఎలా తయారవుతుందో చూద్దాం. 
         గతంలో కట్టెను పొయ్యిలో  మండిచి  వంటచేసేవారు. ఆ  కాలిన కట్టే  బొగ్గుగా మారుతుందని మనకు తెలుసు. ఈ బొగ్గును ఇస్త్రీ పెట్టెలో వేసి బట్టలు ఇస్త్రీ చేసేవారు. ఇదే సూత్రం మీదనే బొగ్గు తయారైంది. 
        వేల ఏళ్ల క్రితం ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు కారణంగా పెద్ద పెద్ద అడవులు ధ్వంసమై వట వృక్షాలు  భూమి అడుగుకు చేరిపోయాయి. భూమిలో ఏర్పడే వేడి, వత్తిడి కారణంగా నేల అడుగున చేరిన వృక్షాలు పొరలు పొరలుగా గట్టిపడి బొగ్గుగా మారాయి.  ఇలా బొగ్గుగా మరటానికి వందల ఏళ్ళు పట్టాయి. ఆ గట్టిపడిన  వృక్షల అవశేషాలనే  నేల బొగ్గు అని, రాక్షస బొగ్గు అని అంటున్నాము. ప్రపంచంలో చాలా చోట్ల ఈ బొగ్గు గనులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అనేక గనులు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ వనరు కోసం అన్వేషణ ప్రారంభమైంది.
కామెంట్‌లు