గజల్ : ---. ఎం. వి. ఉమాదేవి --నెల్లూరు


 పేరులేని ఆకాలం పెదవికదిపి నవ్వుతుంది 

ఊరువాడ చిత్తరువుగ హృదినినిలిపి నవ్వుతుంది 


ఆచ్ఛాదన లేనిపుడమి వొళ్ళుమరిచి హాయిగుండె 

పచ్చపచ్చ  గాపరిధిని పెంచిమొలిచి నవ్వుతుంది 


 పొట్టుగల్ల ధాన్యాలను దంచి, విసిరి పిండిజేసె  

సంప్రదాయ సాపాటుల రుచినితలచి నవ్వుతుంది 


మూగప్రాణి ఆరాధన పాడిపంట పరిశోధన 

బ్రతుకుపంట పండించిన హలంగెలిచి నవ్వుతుంది 


మట్టికుండ లోపచనం చిట్టిగుండెలిక పదిలం 

గట్టి సూత్రమొకటేదో ఇలనుకొలిచి నవ్వుతుంది 


మొక్కజొన్న పసిడిచేను చక్కనిదొక  పాటయింది 

నులకమంచ మొకటివాలి నిద్రముంచి నవ్వుతుంది 


కలతలేని కష్టజీవి కడుపునిండి కూడుమిగిలె

గరిసెలోని లక్ష్మి ఉమా భుజంచరిచి నవ్వుతుంది !