తగిన ఫలితం : జగదీశ్ యామిజాల


 కోపం

ఎండలాటిది!

అన్ని వేళలా వేడెక్కించదు!!


సంతోషం

వెన్నెలలాటిది!

అన్ని వేళలా వెలుగివ్వదు!


వాటివాటికీ

సమయం

సందర్భం

ఉంటూ ఉంటాయి!!


అవొచ్చినప్పుడు

ఉపయోగించుకోవడం

తెలియాలి!

అప్పుడే

తగిన ఫలితాన్ని

పొందగలం!


కామెంట్‌లు