అరసున్న, బండి ' ఱ 'లు నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు.ఐతే ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి. ద్రావిడభాషాలక్షణాన్ని నిరూపించేవి. అంతేకాదు- కావ్యభాషలోను, లక్షణశాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. వాడకపోతే పరవాలేదు గానీ వీటిగురించి తెలుగువాడు తెలుసుకోవాలిగదా! మన భాషాసంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా! అరసున్న(ఁ ) , ఱ- ల వల్ల అర్థభేదం ఏర్పడుతొంది. పదసంపదకి ఇవి తోడ్పడతాయి. ఎలాగో చూడండి:అరుఁగు = వీది అరుగుఅరుగు = వెళ్ళు, పోవుఅఱుగు = జీర్ణించుఏఁడు = సంవత్సరంఏడు = 7 సంఖ్యకరి = ఏనుగుకఱి = నల్లనికాఁపు = కులముకాపు = కావలికాఁచు = వెచ్చచేయుకాచు = రక్షించుకారు = ఋతువుకాలముకాఱు = కారుట (స్రవించు)చీఁకు = చప్పరించుచీకు = నిస్సారము, గ్రుడ్డితఱుఁగు = తగ్గుట, క్షయంతఱుగు = తరగటం(ఖండించటం)తరి = తరుచుతఱి = తఱచుతీరు = పద్ధతితీఱు = నశించు, పూర్తి(తీరింది)దాఁక = వరకుదాక = కుండ, పాత్రనాఁడు = కాలమునాడు = దేశము, ప్రాంతమునెరి = వక్రతనెఱి = అందమైననీరు = పానీయంనీఱు = బూడిదపేఁట = నగరములో భాగముపేట = హారంలో వరుసపోఁగు - దారము పో( గుపోగు = కుప్పబోటి = స్త్రీబోఁటి = వంటి [నీబోఁటి]వాఁడి = వాఁడిగాగలవాడి = ఉపయోగించివేరు = చెట్టు వేరువేఋ = మరొకవిధముమడుఁగు = వంగు, అడఁగుమడుగు = కొలను, హ్రదముమొదలైనవీ ఉన్నాయి.[డాక్టర్ ద్వా. నా. శాస్త్రి గారి "సాహిత్య కబుర్లు" , "తెలుగు వెలుగు" ల నుండి.]
అరసున్న [ ఁ ], బండి ' ఱ 'లు ఎందుకు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి